మన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కరోనా కేసులు, 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. కేసులు పెరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో సంభాషించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు మాట్లాడారు. మధ్యప్రదేశ్ లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, కానీ పాజిటివిటి రేటు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇకపోతే మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత ఉందని, ఆక్సిజన్ సరఫరా చేయాలనీ కోరారు. ఇక కొత్తగా ఏర్పాటైన తమిళనాడు ప్రభుత్వంతో కూడా ప్రధా ని మాట్లాడారు. తమిళనాడుకు అన్ని విధాలుగా సహకరిస్తామని, కరోనా కట్టడికికఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కోరారు. కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం రెండు వారాల లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే చూడాలి మరి ఇంకా మిడి ఎవరెవరితో మాట్లాడుతాడు అనేది.
previous post
next post
రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు: మంత్రి అవంతి