telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు..సబ్బం హరికి అవంతి వార్నింగ్

pabbam avanti

తన ఇంటి ప్రహరీని కూల్చడంపై మాజీ ఎంపీ సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు.ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వైసీపీ నేతలపై వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తానేంటో చూపిస్తానంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైజాగ్ కు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సబ్భం హరిపై మండిపడ్డారు.

నీవేమైనా రౌడీ అనుకుంటున్నావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ అవంతి వార్నింగ్ ఇచ్చారు. వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవీఎంసీ సిబ్బందిని దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలను కూల్చితే కక్ష సాధింపులంటున్నారని విమర్శించారు. కక్షసాధింపులకు దిగాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. నోటీసులు ఇచ్చే జీవీఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగించారని అవంతి అన్నారు.

Related posts