telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఫేస్ క్రీం వాడి .. కోమాలోకి.. జరభద్రం బిడ్డా..

women into coma on using face cream

కొందరు అతివలు మార్కెట్లోకి ఏ కొత్త క్రీం వచ్చిన కొనేసి తెగ వాడేస్తుంటారు. వాళ్ల అందం మీద వారికున్న శ్రద్ధ అలాంటిది. దాన్ని క్యాష్ చేసుకుంటూ యాడ్స్ కూడా అలానే చూపిస్తారు. అందం మీద మోహం వుండాలి కాని అతి మోహం ఉంటె ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. ఇలానే జరిగింది ఓ మహిళకు.ఫేస్ క్రీమ్ రాసుకోగానే ఆ మహిళ కోమాలోకి జారుకుంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 47 ఏళ్ల ఓ మహిళ చర్మంపై మచ్చలు, ముడతలు తొలగించే ఫేస్‌ క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. దాన్ని ముఖానికి రాసుకోగానే అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. ఆమె రాసుకున్న ఫేస్‌ క్రీమ్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఆ క్రీమ్‌ను పరిశీలించిన వైద్యులు, అందులో మేతేల్మెర్క్యూరీ అనే రసాయనం కలిసిందని తెలిపారు.

ఈ రసాయనం వల్ల నరాల వ్యవస్థ దెబ్బతిని, బాధితులు సెరెబ్రల్ పాల్సె అని పిలవబడే మస్తిష్కపక్షవాతంకు గురవ్వుతారన్నారు. ఇలాంటి ఫేస్ క్రీమ్‌ వల్ల శరీరం విషతుల్యం కావడం చాలా అరుదని, ఇలాంటి కేసును తొలిసారి చూస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పై ఆమె కొడుకు మాట్లాడుతూ.తక్కువ ధరకు ఫేస్ క్రీమ్ లభిస్తుందనే కారణంతో ఆమె మెక్సికో నుంచి ఆర్డర్ చేసింది. ఈ ఫేస్ క్రీమ్ ఉపయోగించిన కొన్ని గంటల తర్వాత అమ్మ అస్వస్థతకు గురికావడంతో, ఆమెను హాస్పిటల్‌లో చేర్చగా, కొద్ది రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. వైద్యులు అమ్మ ఉపయోగించిన కాస్మోటిక్స్‌ను పరిశీలించాగా ఆ ఫేస్ క్రీమ్‌లో మెర్క్యూరీ శాతం ఎక్కువగా ఉందని, అది కల్తీ ప్రొడక్ట్ అని తేలిందని పేర్కొన్నాడు.

Related posts