telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాని “వి” : వస్తున్నా వచ్చేస్తున్నా… వీడియో సాంగ్

Naseeruddin-shah

ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేద థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీ లో ఈ చిత్రాన్ని భారతదేశంతో 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్‌లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్‌ను వీక్షించవచ్చని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. తాజాగా ఈ చిత్రంలోని సూథింగ్ మెలోడీ సాంగ్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం ఆవిష్కరించింది. ‘వస్తున్నా వచ్చేస్తున్నా..’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆలపించగా అమిత్ త్రివేది స్వరపరిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts