వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు జీవోతో విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని తెలిపారు. తీరా గుట్టు రట్టు కావడంతో నాలుక కరుచుకుని జీవో రద్దు చేశారని పేర్కొన్నారు.దొడ్డిదారిన విజయసాయిరెడ్డిని మరోసారి ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు ఇంకో ఎత్తుగడ వేశారని ఆరోపించారు.
ఆర్డినెన్స్ ద్వారా విజయసాయిరెడ్డికి పదవి కట్టబెట్టే పథకం వేశారని విమర్శించారు. తన కేసుల లాబీయింగ్ కోసమే పదవి కట్టబెట్టే ప్రయత్నమని ఆరోపించారు. 13 రోజులపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పదవిలో ఉన్న విజయసాయి రెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని యనమల డిమాండ్ చేశారు.
చంద్రబాబు, లోకేశ్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు: రోజా