ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. దాదాపుగా అరగంటకు పైగా పలు విషయాలు చర్చించినట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితం తన అభిమానులు, అనుచరులతో సమావేశమైన సమయంలో తాను ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తానని కొణతాల రామకృష్ణ ప్రకటించారు.అయితే కొణతాల టీడీపీలో చేరడం కోసమే బాబుతో భేటీ అయ్యారనే ప్రచారం సాగుతోంది.
ఈ నెల 16వ తేదీన కొణతాల రామకృష్ణ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో వైసీపీలో కొణతాల రామకృష్ణ చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, కొణతాల రామకృష్ణ మాత్రం వైసీపీలో చేరలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపైనే తాను జగన్‌తో చర్చించినట్టుగా ప్రకటించారు.ఈ తరుణంలో కొణతాల రామకృష్ణ మరోసారి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.