telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి నిరసనలు చేశారు. వారి తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో సంస్కార వంతంగా, గౌరవ ప్రథంగా వ్యవహరించాలని సూచించారు. ‘ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు… మీరు వీధి రౌడీలు కాదు’ అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు.

సభ పట్ల, స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సరిగ్గా ప్రవర్తిస్తే మీతోనే సభను నిర్వహిస్తానన్న ఆయన.. సభ్యులు సభకు వచ్చే ముందు నిబంధనలు చదువుకుని రావాలని పేర్కొన్నారు..

విలువైన సభా సమయాన్ని వృథా కానీయొద్దని, సభా మర్యాదను కాపాడాలని స్పీకర్ పదే పదే అభ్యర్థించినా నినాదాలతో హోరెత్తించారు..  దీంతో టీడీపీ సభ్యులను సభాపతి సభ నుంచి ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు.

Related posts