ముగ్గురు మోదీలు ఒక్కటయ్యారని రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, తెలంగాణ మోదీ, కోడికత్తి మోదీ కలిసి ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీ అభివృద్ధి ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించాం కానీ, నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. ఏపీతో మోదీ బాగున్నంత వరకూ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాగున్నారని, మోదీతో మనం విభేదించాక ఏపీని కేసీఆర్ విమర్శించడం మొదలెట్టారని దుయ్యబట్టారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది: ఎంపీ కోమటిరెడ్డి