telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదు -సోము వీర్రాజు

తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని తాము ఎక్కడ చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్కక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తాము జనసేనతో కలసి వెళతామని మాత్రమే చెప్పామని సోము వీర్రాజు తెలిపారు.

ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ ఎన్నికల కోసం రోడ్డు మ్యాప్ తయారు చేస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తు ఉంటుందని మీడియా సృష్టి మాత్రమేనని సోము వీర్రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని అధికారంలో నుంచి దించి బీజేపీ, జనసేన పవర్ లోకి వస్తుందని చెప్పారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీపై చర్చ జరిగిందని.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు.చివరకు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు

Related posts