telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

పిన్నెల్లిని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు.

జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా… నేడు తీర్పు వెలువరించింది.

పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్గా న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.

ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

Related posts