ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతోన్న నేపథ్యంలో అధికారులు మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ భాస్కర్ మీడియాకు వివరాలు తెలిపారు. ఒంగోలులో కరోనా కేసులు పెరుగుతోన్న దృష్ట్యా పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నామని తెలిపారు.
ఆదివారం నుంచి 14 రోజుల పాటు సడలింపులు లేని లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 267కు చేరింది. నిన్న ఒంగోలులో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కరోనా తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ..ఇది జగన్నాటకమే: చంద్రబాబు