ఏపీసీఎం జగన్ కర్ణాటకలో కదిరికి చెందిన పాఠశాల బస్సు ప్రమాదంపై ఆరా తీశారు. తక్షణమే సహాయక కార్యక్రమాలు అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి చికిత్స అందించేలా చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.
కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లా జోగ్ జలపాతం వద్ద లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందగా, ఇద్దరు ఉపాధ్యాయులు, నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.