ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
అలాగే రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు. అనంతర తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం.
అలాగే సాయంత్రం 4.45 గంటలకు విశాఖకు వెళతారని తెలుస్తోంది. నేడు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖకు వస్తుండటంతో ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ విశాఖ వెళతారు.
అక్కడ కార్యక్రమం ముగిశాక రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జగన్. విశాఖలో రాష్ట్రపతి రానుండడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.