*తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
*బుధవారం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
*మార్చి నెల కోటా టికెట్లు భారీగా పెంచిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల అదనపు కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది..
అదేవిధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇస్తారు.
కాగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను 20వేలకు పెంచడంతో ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకునేవారి సంఖ్య 50-60వేలకు చేరుకునే అవకాశముంది.
అదేవిధంగా, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31 వరకు సంబంధించిన కాలానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.