వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. తనదైన సైటిరికల్ కామెంట్స్‌తో నిత్యం సినీ, రాజకీయ సెలబ్రెటీలపై ట్వీట్ చేస్తూ ఉంటాడు..అందుకే ఆయన పెట్టే ప్రతి పోస్ట్, ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రాణా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ట్రైలర్ విడుదల అయింది. మొదటి నుండి కూడా విమర్శిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ మరో సారి తనదైన శైలిలో ఆ సినిమా పై కామెంట్ చేశాడు.
బాహుబలి సినిమా కారణంగా పవన్ కంటే కూడా రానా దగ్గుబాటినే హిందీ ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి వాళ్ళు భీమ్లా నాయక్ సినిమాలో రానా హీరో , పవన్ విలన్ అని పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు.
మరో ట్వీట్‌లో ‘భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే రానా పాపులారిటీ పెంచడానికే చిత్రయూనిట్ పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్లు కనిపిస్తోంది. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో వర్మ చేసిన ఈ స్టేట్‌మెంట్స్‌పై పవన్ అభిమానులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ట్రైలర్ విడుదల అయింది.మొదటి నుండి కూడా విమర్శిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ మరో సారి తనదైన శైలిలో ఆ సినిమా పై కామెంట్ చేశాడు
ఈ అగ్ర దర్శకుడిని కొట్టి థియేటర్ నుంచి తరిమేశారట…!