telugu navyamedia
సినిమా వార్తలు

“ఆకాశవాణి” టీజర్ అవుట్

Akashavani

సైన్స్ స్టూడియోస్ పతాకంపై సతీశ్ బత్తుల అనే యువ దర్శకుడు రూపొందిస్తున్న చిత్రం “ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం”. ఈ చిత్రంలో శివ, ఉమయ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే ఐడెంటిటీ కోసం ఓ యువకుడు పడుతున్న తపన కనిపిస్తోంది. మర్రిమేకల మల్లిఖార్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి విడుదలచేశారు. ఇటీవల మజిలీ సినిమాలో హీరో ఫ్రెండ్‌ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసిన శివ.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో.. తాజాగా విడుదలైన టీజర్ చూసి కొడుకు మధ్య అనుబంధానికి సంబంధించిన కథ హైలైట్ గా ఉంటుందని అర్థమవుతోంది. మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 

Related posts