telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రవితేజ ప్లాప్ సినిమాకు ఊహించని రెస్పాన్స్

Raviteja

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో ఎన్నో అంచనాల నడుమ వచ్చి విఫలం అయిన చిత్రం “నేల టిక్కెట్”.  డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఇదే ప్లాప్ సినిమాను హిందీ డబ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తే దానికి ఊహించని రీతి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఏకంగా 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సెట్ చేసింది. బహుశా ఇదే రవితేజ కెరీర్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రం ఇదే కావచ్చు. మన దగ్గర ప్లాప్ సినిమాలకు యూట్యూబ్ లో ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే మొదటి సారి కాదు. చాలా చిత్రాలే ఉన్నాయి. ప్రస్తుతం వరుసగా అపజయాలను చవి చూస్తున్న మాస్ మహారాజ్ మంచి విజయం అందుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.

Related posts