సూపర్‌స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మహేశ్ నటిస్తోన్న 26వ చిత్రమిది. ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాని జనాలలోకి మరింతగా తీసుకెళ్లేందుకు మేకర్స్ వినూత్న ఆలోచన చేశారు. ఇక నుండి ప్రతి సోమవారం చిత్రం నుండి ఏదొ ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారట. అవి పాటలు అయిన కావచ్చు, లేదంలో పోస్టర్స్, గ్లింప్స్ వీడియోస్, టీజర్, ట్రైలర్ ఇలా ఏదో ఒకటి ప్రతి సోమవారం అభిమానుల ముందుకు రానుంది.
previous post
next post