telugu navyamedia
సినిమా వార్తలు

యంగ్ యూట్యూబర్ గుండెపోటుతో మృతి

ఈ మ‌ధ్య కాలంలో గుండెపోటుతో చ‌నిపోయేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. వయస్సు తో సంబంధం లేకుండా గుండెపోటు కారణంగా ఎంతో మంది యువతీయువకులు మరణిస్తున్నారు.

Shreya muralidhar: చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటుతో యూట్యూబర్ మృతి.. సంతాపం తెలిపిన ప్ర‌దీప్ | The News Qube

తాజాగా యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో సోమవారం రాత్రి మరణించింది. ఆమె 27 ఏళ్ల వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం అందరినీ కలిచివేస్తోంది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్.

Shreya Ambala (PelliChoopulu) Wiki, Biography, Age, Family, Images - News Bugz

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది.

Famous Young Youtuber Shreya Muralidhar dies of cardiac arrest | Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి | వినోదం News in Telugu

అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది. యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీప్తీ సునయన, దేత్త‌డి హ‌రిక‌, సినీ నటి సురేఖ కుమార్తె సుప్రిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

కాగా శ్రియా మురళీధర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు కుటుంబ సభ్యులు , అభిమానులు  జీర్ణించుకోలేకపోతున్నారు.

Related posts