telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్‌ రాజ్‌కుమార్ కు బాల‌య్య క‌న్నీటి నివాళి..

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ హఠాన్మరణం యావత్ దక్షిణ భారత సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. సూపర్ స్టార్ కు అంతిమ నివాళులు అర్పించేందుకు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు బెంగళూరులోని కంఠీరివ స్టేడియానికి చేరుకుంటున్నారు. పేరుకు కన్నడ హీరో అయినప్పటికి పునీత్‌ రాజ్‌కుమార్‌కు టాలీవుడ్‌ హీరోలతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.

బాలకృష్ణ పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్‌ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్‌, శివబాలాజీ పునీత్‌కు నివాళులు అర్పించారు. బాలకృష్ణ పూజ మాల వేసి నివాళులర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య శివ రాజ్‌కుమార్ ని బాలకృష్ణ పరామర్శించారు.

బాలకృష్ణ తన పునీత్ రాజ్‌కుమార్‌తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. “నా సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ లేరంటే నేను నమ్మలేకపోతున్నానని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు.

కాగా..బాలకృష్ణ నటించిన గౌతమపుత్ర శాతకర్ణిలో శివ రాజ్‌కుమార్‌ నటించారు. కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కి హాజరయ్యారు. డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబంతో బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది .

 

 

Related posts