telugu navyamedia
సినిమా వార్తలు

“దబాంగ్-3” నటుడికి గుండెపోటు… సల్మాన్ ఏం చేశాడంటే…

Salman-Khan

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, సోనాక్షిసిన్హా హీరోహీరోయిన్లుగా “దబాంగ్-3” చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ “భారత్” సినిమా షెడ్యూల్‌తో సల్మాన్ బిజీ అవ్వడంతో “దబాంగ్-3” షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా “దబాంగ్-3” చిత్రం మళ్లీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇందులో పాండే కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పాండేకి గుండెపోటు వచ్చింది. “దబాంగ్-3” సెట్స్ లో ఈ ఘటన జరగనప్పటికీ ఆయన బాగోగులు చూసుకోవాలని సల్మాన్ తన మనుషులను పంపించారు. గొరెగావ్ లోని ఆసుపత్రికి పాండేను తరలించారు. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. సల్మాన్ తన పెద్ద మనసుతో పాండేని ఆదుకున్నాడని తెలుసుకున్న అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దబాంగ్ సీక్వెల్ లో భాగంగా వస్తోన్న ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts