telugu navyamedia
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కు హాలీవుడ్ స్టార్ ఆహ్వానం… “స్పై” సినిమా కోసమే…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు ఉన్న క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. మహేష్ కు తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన క్రేజ్ హాలీవుడ్ కు కూడా పాకినట్లుంది. తాజాగా హాలీవుడ్ స్టార్ బిల్ డ్యూక్ కూడా మ‌హేష్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మ‌హేష్‌బాబుతో పాటు వంశీ పైడిప‌ల్లి, ఏఆర్ మురుగ‌దాస్ వంటి ద‌ర్శ‌కుల‌ను ఆయ‌న లంచ్‌కు ఆహ్వానించారు. “వంశీపైడిప‌ల్లి, మ‌హేష్ మీరు లాస్ ఏంజెల్‌కు వ‌చ్చిన‌పుడు డౌన్‌టౌన్ లాస్ఏంజెల్స్‌లో దిగి భోజ‌నానికి రండి. మనం అంత‌ర్జాతీయ స్పై సినిమా గురించి చ‌ర్చించుకుందాం” అని ట్వీట్ చేశారు. ఇదే విధంగా తమిళ డైరెక్ట‌ర్‌ ఏఆర్ మురుగ‌దాస్‌, యునైటెడ్ నేష‌న్స్ ఉమెన్స్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్ అయిన ఐశ్వ‌ర్య ధ‌నుష్‌ లకు కూడా ఈ హాలీవుడ్ స్టార్ నుంచి ఆహ్వానం అందింది. 

Related posts