telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“త‌ద‌మ్‌” రీమేక్ హిందీలో కూడా… సిద్ధార్థ్ హీరోగా…!

Siddharth

ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రామ్ ప్ర‌స్తుతం రెడ్ అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. త‌మిళ చిత్రం “త‌ద‌మ్‌”కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో రామ్ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. “త‌ద‌మ్” చిత్రం హిందీలోను రీమేక్ కానున్న‌ట్టు తాజా స‌మాచారం. బాలీవుడ్ హీరో సిద్ధార్ద్ మ‌ల్హోత్రా చిత్ర క‌థ న‌చ్చి మూవీని రీమేక్ చేయాల‌ని భావించాడ‌ట‌. మే నుండి హిందీ రీమేక్ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, క‌బీర్ సింగ్ ప్రొడ్యూస‌ర్ ముర‌ద్ కెతానీ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వ‌ర్ధ‌న్ కేత్క‌ర్ ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి ద‌ర్శ‌కుడిగా అడుగుపెట్ట‌నున్నాడు. చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు

Related posts