telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : హౌజ్ మేట్స్ కు నాగ్ అక్షింతలు

Bigg-Boss

ఎన్నడూలేని విధంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ నియంతలా మారి హౌజ్‌మెట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు పిల్లిలా ఉన్న మాస్టర్‌ ఇప్పుడు పులిలా పంజా విసురుతున్నారు. తన మాట శాసనం అనేలా ప్రవర్తిస్తున్నాడు. పనుల విభజనలో భాగంగా తనకు నచ్చని వారికి ఎక్కువ పనులు అప్పజెప్పుతూ, తన స్నేహితులైన అరియానా, మెహబూబ్‌, అవినాష్‌కు చిన్న పనులు చెప్పాడు. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద ర‌భ‌స చోటు చేసుకుంది. మాస్టర్‌ ఇచ్చిన పనులపై ఇంటి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. తాము ఆ పనులు చేయలేమని ముఖం మీద కొట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ మాస్టర్‌ తన పంతా మార్చుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో మాస్టర్‌ కెప్టెన్సీ విధానంపై ఇంటిలోని సభ్యులతోపాటు నెటిజన్లు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో మాస్టర్‌పై తీవ్ర ట్రోలింగ్‌ చేస్తున్నారు. కాగా ఈ వారం ఇంటిస‌భ్యులు చేసిన త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూపేందుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ సిద్ధ‌మ‌య్యారు. నాగ్ అక్షింత‌లు వేస్తున్నాడంటే ఆ లిస్టులో త‌ప్ప‌కుండా అభిజిత్ మొద‌టి స్థానంలో ఉంటాడు. ఈ రోజు కూడా నాగ్ అభిజిత్‌ను నిల‌బెట్టి క్లాస్ పీకారు. నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు బిగ్‌బాస్ ఇచ్చిన టీ స్టాండ్ టాస్క్‌లో అభిజిత్ స్వ‌చ్ఛందంగా ప‌క్క‌కు త‌ప్పుకున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఆత్మ గౌర‌వం అంటూ వెళ్లిపోయావు? అంటే మిగ‌త‌వాళ్ల‌కు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అని సూటిగా ప్ర‌శ్నించారు. దీంతో అభి నీళ్లు న‌ములుతూ అంద‌రి గురించి అన్నాను అని స‌మాధానిమిచ్చాడు. ఆత్మ గౌర‌వం పేరిట టాస్కులో నుంచి వైదొల‌గ‌డాన్ని ఎంత‌మంది స‌మ‌ర్థిస్తారు అని నాగ్ ప్ర‌శ్నించ‌గా అంద‌రూ నేల‌చూపులు చూశారు. ఇక అమ్మాయిలు బాధ‌ప‌డితే త‌ట్టుకోలేని నాగ్ ఇంట్లో ఏకాకిగా మారిన‌ మోనాల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న గోడు వెల్ల‌బోసుకునే స‌మ‌యం రావ‌డంతో మోనాల్ తన బాధ‌ను క‌క్కేసింది. అఖిల్ నామినేట్ చేస్తాడ‌ని ఊహించ‌లేదు అని త‌న్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నం చేసింది. అఖిల్ నా ఫ్యామిలీ అనుకున్నాను అని చెప్పింది. ఆమె మాట‌లు విన్నాక నాగార్జున మోనాల్ నీకు స్నేహితురాలా? అంత‌క‌న్నా ఎక్కువా? అని ప్ర‌శ్నించారు. ఊహించ‌ని ప్ర‌శ్న‌తో అఖిల్ బిక్క‌మొహం వేశాడు. ఇక టీ స్టాండ్ టాస్కులో ఐస్ వాట‌ర్‌ను ముఖానికి కొట్టిన అరియానా తీరును నాగ్ ముందే సోహైల్‌, మోనాల్ త‌ప్పు ప‌ట్టారు. అయితే వాటిని అరియానా కొట్టిపారేసింది. నాకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు, చేశాను అని సింపుల్‌గా స‌మాధాన‌మిచ్చింది. మ‌రి వీరిలో నాగ్ ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తార‌నేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు చూడాల్సిందే.

Related posts