telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డైలమాలో “సోలో బ్రతుకే సో బెటర్”… ఆ సినిమా ఎఫెక్ట్ ?

SBSB

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధంగా అంది.  “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో అని చిత్రయూనిట్ డైలమాలో పడ్డట్టు సమాచారం. ప్రతిరోజు పండగే సినిమా థియేటర్స్ లోనే దాదాపు 45 కోట్ల వరకు రాబట్టింది. ఇక “సోలో బ్రతుకే సో బెటరు” సినిమా కోసం 30 నుంచి 35 కోట్ల మధ్య చెల్లించేందుకు జీ 5 యాప్ ముందుకొచ్చిందట. వచ్చే నెలలో ఈ సినిమా జీ 5 యాప్ ద్వారా జనాలకు అందుబాటులో ఉంటుందట. ఇప్పుడు జీ5 కి అమ్మేసిన ఫిగర్స్ చూస్తుంటే సాయితేజ్ మార్కెట్ కంటే తక్కువకే డీల్ ఓకే అయ్యిందని అనుకోవాలి. దానికి నాని ‘వి’ సినిమా రిజల్ట్ కూడా ఒక కారణం అని విశ్లేషలకులు అనుకుంటున్నారు. నాని – సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా ఇటీవల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేక పోయింది. ఇదిలా ఉంటే త్వరలో మరి సాయితేజ్ డిజిటల్ హిట్ కొడతాడేమో చూడాలి.

Related posts