telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కోల్‌కతా : .. జాలిపడమని అడగటంలేదు .. ఆత్మస్థైర్యం ‘పెంచుకో’మంటుంది ..

girl dance with single leg

అన్నీ సరిగా ఉన్నా, ఏదో లేదని ఎప్పుడూ నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడేవాళ్ళకు కనీవిప్పుగా.. ఒక కాలుపై కొద్దిసేపు నిల్చోడమే కష్టం. అలాంటింది ఓ చిన్నారి తనకు ఒక కాలు లేకపోయినా.. అద్భుతమైన డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అంజలి అనే 11 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో పోరాటంలో తన ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినా తాను ఏ మాత్రం అధైర్య పడలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఇటీవల కోల్‌కతాలో జరిగిన మెడికల్‌ కాన్ఫరెన్స్‌లో డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చింది.

శ్రేయా ఘోషల్‌ పాడిన ‘మేరే డోల్‌నా సున్‌’కు ఒక కాలుతోనే డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపరిచింది. ఆ సాంగ్‌ బీట్స్‌కు తగ్గట్టు పాస్ట్‌ బీట్‌ స్టెప్పులతో అక్కడికి వచ్చిన వారి హృదయాలను దోచుకుంది. అంజలి డ్యాన్స్‌ ప్రదర్శన వీడియోను ఆ సమావేశానికి హాజరైన డాక్టర్‌ అర్నబ్‌ గుప్తా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంజలి ఆత్మస్థైర్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో అంజలి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.

Related posts