telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వరుసపెట్టి సినిమాలను కొనేస్తున్న ఓటీటీలు…

ott

సినిమా హాళ్లు  ఎక్కడ ఓపెన్ అవుతాయో అని ఓటీటీలు తెగ భయపడ్డాయి.ఈ భయంతో  దీపావళికి వచ్చే సినిమాలను వరుసపెట్టి కొనిపడేశాయి.అక్కడితో ఊరుకోకుండాక్రిస్ట్ మస్ వరకు వచ్చే సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చాయి. అయితే కొత్త సినిమాలను థియేటర్లలో చూడలేకపోయినా.. ఎంచక్కా ఓటీటీలలో చూసేసాం కదా అని ఆనందపడే నెటిజన్లు మార్కెట్లో చాలామందే ఉన్నారు.అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే…  తలకు మించి భారం అయినప్పటికీ ఓటీటీలు ఖర్చుకు వెనకాడటం లేదు.థియేటర్ల వ్యవస్థ పుంజుకుంటే ఓటీటీలకు గడ్డుకాలమని వస్తుందన్న కామెంట్స్ కు భయపడో .. మరో కారణంతోనో గత కొంతకాలంగా థియేటర్లు లేని వెలితిని ఓటీటీలు తీరుస్తున్నాయి. 

తాజాగా దీపావళికి థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అలరించాల్సిన సినిమాలను కూడా తమ వేదికలపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలలో ఉన్నాయి.త్వరలో ప్రముఖ ఓటీటీలలో దాదాపు 7 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నవంబర్ 4న మిస్ ఇండియా వస్తుంది. అలాగే సూర్య  `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాపై కూడా చాలా ఆశ‌లే ఉన్నాయి.న‌వంబ‌రు 12న  అమేజాన్ లో ఈ ఫిలింను మనం చూడొచ్చు. అలాగే ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఈనెల 20న విడుద‌ల అవుతోంది ` మా వింత గాధ వినుమా , అన‌గ‌న‌గా అతిథి  రెండూ… న‌వంబ‌రు 13న ఆహాలో రాబోతున్నాయి. ఇవి కాకుండా ఇత‌ర భాషా సినిమాలు మ‌రో ప‌ది వ‌ర‌కూ ఈ నెల‌లోనే ఓటీటీలలో విడుద‌ల అవుతున్నాయి. .

Related posts