దాదాపు దశాబ్దం పాటు తమిళ సినీ రంగాల్లో అగ్ర కథానాయికగా కొనసాగిన చెన్నై భామ త్రిష. ఇటీవల తమిళంలో “96” సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ప్రస్తుతం త్రిష వయసు 36 సంవత్సరాలు. వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో గతంలో ప్రేమాయణం సాగించిన త్రిష ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. వీరిద్దరి బంధం పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. త్రిష ప్రస్తుతం ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్విటర్ ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఇచ్చిన సమాధానం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. “మీ రిలేషన్‌షిప్ స్టేటస్, పెళ్లి గురించి చెప్పండి?” అని ఓ అభిమాని త్రిషను ప్రశ్నించాడు. దానికి స్పందించిన త్రిష “సింగిల్ బట్ టేకెన్” అని ట్వీట్ చేసింది. ప్రేమలో ఉన్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చింది. దీంతో త్రిష ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది.
previous post