‘మ్యాట్రిక్స్’ సిరీస్‌లో వచ్చిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందడంతో పాటు యాక్షన్ క్లాసిక్‌గా పేరొందాయి. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పుడు నాలుగో చిత్రంగా ‘మ్యాట్రిక్స్ 4’ రాబోతుంది. మెషీన్స్ క్రియేట్ చేసిన వర్చువల్ వరల్డ్‌లో ఇరుక్కుపోయిన మానవజాతిని రక్షించేందుకు ఆ మాయా ప్రపంచంలోకి వెళ్లే ధైర్యవంతుడైన హీరో నియోగా కియానూ రీవ్స్ నటనను అంత త్వరగా మర్చిపోలేం. ‘మ్యాట్రిక్స్ 4’లో ఓ కీలక పాత్రకోసం ప్రియాంకను ఎంపిక చేశారని సమాచారం. ఈ సిరీస్ సహ దర్శకురాలు లానా వాచోవ్‌స్కీ నాలుగో భాగానికి దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలను డైరెక్ట్ చేసిన వాచోవ్‌స్కీ కవలల్లో లానా ఒకరు. కియానూ రీవ్స్, కేరీ అన్నే మోస్, యాహ్యా అబ్దుల్ మతీన్ లీడ్ రోల్స్‌కి సెలెక్ట్ అయ్యారు. వార్నర్ బ్రదర్స్, విలేజ్ రోడ్‌షో పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2021 మే 21న ‘మ్యాట్రిక్స్ 4’ విడుదల కానుంది. ‘క్వాంటికో’ టివి సిరీస్, ‘బేవాచ్’ మూవీ తర్వాత ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం.
previous post