telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ వారసుడితో జతకట్టనున్న సమంత కూతురు…!

ananya

గ‌త కొన్ని రోజులుగా బెల్లంకొండ గ‌ణేష్ ఆరంగేట్రంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సూప‌ర్ హిట్ చిత్రాల‌ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ త‌న‌ చిన్న కుమారుడు సాయి గ‌ణేష్ వెండితెర ఆరంగేట్రంపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేం పవ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. లక్కీ మీడియా, బీటల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వివేక్ ఆత్రేయ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘మజిలీ’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన అనన్య అగర్వాల్‌‌ను ఎంచుకున్నారు. సమంత, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మజిలీలో అనన్య.. సమంతకు కూతురుగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమ్మాయి బెల్లంకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బెల్లంకొండ బాబుకు జోడిగా నటించబోయే భామను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా… ఇప్ప‌టికే బెల్లంకొండ ఫ్యామిలీ నుండి శ్రీనివాస్ 2014లో వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. అల్లుడు శీను చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన శ్రీనివాస్ ఇటీవ‌ల విడుద‌లైన “రాక్ష‌సుడు” చిత్రం మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Related posts