కేంద్ర ప్రభుత్వం 2020 జనాభా లెక్కింపు, ఎన్‌పీఆర్ కార్యాచరణపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. సమావేశంలో కేంద్ర హోశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, జనాభా లెక్కింపు అధికారులు పాల్గొననున్నారు. 2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.