telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పెళ్లిళ్ల సీజన్ : బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభవార్త

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 49,590 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.77,500 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ లో వెండి తడ్డడం కాస్తా ఊరట కలిగించే విషయం.

Related posts