telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పవార్ ల మధ్య చిచ్చు పెట్టేసిన … బీజేపీ… పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుందే..

pavars fighting with bjp divide and rule policy

మహారాష్ట్ర రాజకీయాల్లో అప్పుడు వరకు ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన పార్టీల పొత్తుతో శివసేన నాయకుడు సీఎం సీటులో కూర్చుంటాడు అని అనుకోగా … మహారాష్ట్ర రాజకీయ వర్గాలు అన్నింటికీ బిగ్ షాక్ ఇస్తూ బీజేపీ తెర మీదికి వచ్చి… దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకరం చేశారు. బిజెపి పార్టీకి మద్దతు తెలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బీజేపీకి మద్దతు తెలపడం అనే నిర్ణయం అజిత్ పవార్ యొక్క సొంత నిర్ణయం తప్ప ఎన్సిపి బిజెపికి మద్దతు తెలిపే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. బిజెపికి మద్దతు తెలిపిన అజిత్ పవార్ ను ఎన్సీపీ ఎల్పీ నేత గా తొలగించినట్లు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ప్రకటించారు.

అజిత్ పవార్ మాత్రం ఇంకా నేను ఎన్సీపీ లోనే ఉన్నాను… ఎన్సీపీ లోనే కొనసాగుతాను… మా నాయకుడు శరద్ పవార్ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించాడు అజిత్ పవార్. కాగా అజిత్ పవార్ వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అజిత్ పవార్ ట్విట్లు తనపై అనుమానాలు వ్యక్తం చేసేలా ఉన్నాయని భావించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్…అజిత్ పవార్ ట్విట్లపై వెంటనే స్పందించారు. అజిత్ పవర్ బిజెపికి మద్దతు తెలుపుతూ వెళ్లిన అడుగుల వెనక తాను లేను అంటూ శరత్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్సీపీ పార్టీ బీజేపీకి మద్దతు తెలిపి… బిజెపితో కలిసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. శివసేన కాంగ్రెస్ లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది అంటూ ఆయన అన్నారు. అజిత్ పవార్ తన ట్విట్ లతో గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అజిత్ పవార్ ట్విట్ చేసిన గంటల సమయంలోనే శరద్ పవార్ అజిత్ పవార్ కు కౌంటర్ ఇచ్చారు.

Related posts