telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అనుమతులే లేకుండా.. పోలవరం… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..

supreme court two children petition

పోలవరం నిర్మాణంపై మరో అడ్డంకి తయారవుతుంది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఒడిశా పోలవరం పై తీవ్రంగా స్పందించడం ప్రారంభించింది. వీలైన అన్ని న్యాయపరమైన చర్యలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెగబడింది. దీనితో సుప్రీం కోర్టు కూడా కేంద్ర-రాష్ట్ర(ఏపీ) ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సరైన అనుమతులు లేవని, స్టాప్ వర్క్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం వాదించింది. అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించింది.

ఈ నేపథ్యంలో, ఒడిశా ఆరోపణలకు సమాధానం చెప్పాలని కేంద్రం, ఏపీ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికోసం మూడు వారాల గడువును ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.

Related posts