telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ కు సవాల్ విసిరిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో వరదసాయానికి బ్రేక్‌ వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అయితే, వరద సాయం బీజేపీ ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసిందని.. పేదల పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. మరోవైపు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం ది నోరు కాదు.. మోరి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మేం 10 వేలు సరిపోవు… మీకు దుర్బుద్ధి లేక పోతే ఇంటింటికి సర్వే చేసి డబ్బులు ఇవ్వాలని అడిగామన్న ఆయన.. దీనిపై చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణానికి సిద్ధం.. కేసీఆర్‌ సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు. వరద నిధులు అపమన్నవాడు మూర్ఖుడు.. ఆపినోడు ఇంకా మూర్ఖుడు అంటూ ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. వరదసాయం కోసం వెళ్లి ఇవాల మహిళ చనిపోయింది.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు బండి సంజయ్‌… సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందన్న ఆయన.. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. మరోవైపు.. ఇవాళే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తామన్నారు.. పార్టీలో పోటీ పెరిగింది కాబట్టి అక్కడక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయన్నారు.. టీఆర్ఎస్‌కు అభ్యర్థులు లేరు.. కాబట్టే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందన్నారు. 10 వేల రూపాయల వరదసాయం ఇచ్చుకోవచ్చని చెప్పిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఎందుకు ఆపింది..? ప్రశ్నించారు బండి సంజయ్.. ఇంతకన్నా చిల్లర ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. సోషల్ మీడియాలో నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న లెటర్ తనది కాదన్నారు.. అది నా లెటర్ హెడ్ కాదు… నా సంతకం కాదు అని తెలంగాణ బీజేపీ చీఫ్‌ స్పష్టం చేశారు.

Related posts