ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “మలంగ్”. సినిమాలోని నటీనటులను పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా హీరో హీరోయిన్‌లకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. ఆదిత్య రాయ్ కపూర్ భూజాల మీద కూర్చున్న దిశ అతడి లిప్ లాక్ చేస్తున్నట్టుగా ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టిల్ రిలీజ్ అయిన తరువాత సినిమా మీద ఆసక్తి పెరిగింది. అయితే పోస్టర్‌లో రిలీజ్ చేసిన సీనే కాకుండా సినిమాలో మరికొన్ని ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటిలో ఓ కిస్ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్ వాటర్‌లో ఓ కిస్ సీన్ ఉంది. దాదాపు నిమిషం నిడివి ఉండే ఈ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట. అంతసేపు అండర్ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్ కెపాసిటీని పెంచేందుకు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. సింగిల్ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట చిత్రయూనిట్. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
previous post
next post