telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాల్లోకి రాకముందు వాచ్ మాన్ జాబ్ చేశా : షాయాజీ షిండే

సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన మూడేళ్ల పాటు ఒక కాలేజ్ వాచ్ మెన్‌గా పని చేసాడు సాయాజీ షిండే. పేరుకు మరాటి నటుడు అయినా కూడా తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షిండే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా లారీ ఢీ ముగ్గురు ఠా అంటూ పోకిరి సినిమాలో ఈయన చెప్పిన డైలాగులు ఇంకా అందరికీ గుర్తుండే ఉంటాయి. దానికంటే ముందే చిరంజీవి ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడు. తెలుగు భాష కాకపోయినా కూడా అర్థం తెలుసుకుని మరీ డబ్బింగ్ చెప్తాడు షిండే. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి బయట పెట్టాడు. తాను మహారాష్ట్రలో పుట్టానని.. తనది చాలా పేద కుటుంబం అని చెప్పాడు సాయాజీ షిండే. తన ఊర్లో ఏడో తరగతి వరకు చదువుకున్న తర్వాత పక్క ఊరికి వెళ్లి టెన్త్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యానని.. అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్‌గా చేశానని చెప్పాడు షిండే. పగలు చదువుకోవడం రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్‌గా ఉండటం.. ఆ వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు తన నెలసరి ఖర్చులు చూసుకునేవాడినని చెప్పాడు ఈయన. మరాఠీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు షాయాజీ షిండే.

Related posts