telugu navyamedia
సినిమా వార్తలు

సాహో అప్డేట్ : స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో హాట్ బ్యూటీ

Prabhas

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తున్న యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ “సాహో”. ఇప్పటికే విడుదలైన టీజర్లో ప్ర‌భాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్ష‌న్ సీన్స్ సామాన్య జ‌నాల‌నే కాక సెల‌బ్రిటీల‌ని కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్‌తో సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్ర చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుండ‌గా, ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్‌ ఇటీవలే విడుదల కాగా… సినీ ప్రముఖులందరూ టీజర్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ చిత్ర టాకీ పార్ట్ దాదాపు పూర్తికాగా… ప్ర‌స్తుతం ఆస్ట్రియాలో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అక్కడ ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాల‌పై సాంగ్స్ చిత్రీక‌రిస్తున్నారు. తాజాగా హీరో ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. “ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అధ్బుతమైన అనుభూతి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాలోని సాంగ్‌ కు హాట్ బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ప్ర‌భాస్‌తో చిందేసిందట‌. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ అభిమానులు.

Related posts