telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య చేత ఆ సీన్ చేయించి తప్పు చేశా… : బి.గోపాల్

Gopal

“లారీ డ్రైవర్”, “సమరసింహారెడ్డి”, “నరసింహనాయుడు” లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు నటరత్న నందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కాయి. వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న ఈ కాంబినేషన్ లో వచ్చిన “పల్నాటి బ్రహ్మనాయుడు” మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఫలితం పక్కనపెడితే, సినిమాలోని కొన్ని సీన్లు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ తొడ కొడితే కుర్చీ ముందుకు రావడం, ట్రైన్ వెనక్కి పోవడం వంటివి నవ్వులపాలయ్యాయి. ఆ సీన్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మాట్లాడారు. “పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. ఆ సినిమాలో కొన్ని సీన్లు విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ సినిమాలో పెట్టకుండా ఉండాల్సింది. ఆ సీన్ గురించి ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. ఆ సీన్ పెట్టి చాలా తప్పు చేశాననే ఫీలింగ్ నాకుంది” అని గోపాల్ చెప్పారు.

Related posts