కొన్ని నెలల క్రితం యాంకర్ రవి తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశాడు. తన భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాపను కూడా పరిచయం చేశాడు రవి. అప్పట్లో ఈయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఈటీవీలో వచ్చిన “ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు” షోలో కూడా మరోసారి రవి కుటుంబంతో పాటు వచ్చాడు. అక్కడికి కూడా భార్య నిత్యాతో పాటు కూతురు వచ్చింది. ఈ షోలో రవిపై వచ్చే ఎఫైర్స్ గురించి మాట్లాడుకున్నారు. తనపై వచ్చే రూమర్స్ ను తన భార్య అస్సలు పట్టించుకోదని… మరీ ముఖ్యంగా ఆమె సపోర్ట్ చేయడమే చాలా సార్లు తనను టెన్షన్ నుంచి బయట పడేస్తుందని చెబుతున్నాడు ఈ యాంకర్. తన ప్రేమ, పెళ్లి గురించి సంచలన విషయాలను వెల్లడించాడు. కెరీర్ మొదట్లో యాంకర్ లాస్యతో ఈయనకు చాలా కాలం పాటు ప్రేమ వ్యవహారం నడిచిందని వార్తలు వచ్చాయి.. కానీ ఆ విషయంపై లాస్య చాలా సీరియస్ అయింది. అప్పట్లో రవిపై ఈమె చేసిన ఆరోపణలు కూడా సంచలనం రేపాయి.
ముఖ్యంగా తనతో కెరీర్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే రవి పెళ్లైపోయిందని లాస్య చాలా సార్లు చెప్పింది కూడా. అయితే రవి మాత్రం తన పెళ్లి గురించి చాలా ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాడు. కొన్నాళ్లకు లాస్యకు వేరే అతనితో పెళ్లి అయిపోవడంతో తన పెళ్లి గురించి కూడా బయటపెట్టాడు రవి. ఆ తర్వాత శ్రీముఖితో కూడా ఈయనకు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వర్షిణి అంటున్నారు. ఇలాంటి సమయంలో తన భార్య నిత్య సక్సేనా.. మూడేళ్ల కూతురు వియాను ప్రపంచానికి పరిచయం చేసాడు రవి. తన ప్రేమ విషయం కూడా బయటపెట్టాడు ఈయన. రవి బీటెక్ చదివే రోజుల్లోనే నిత్య పరిచయం ఉందని, అయితే తన ఫ్రెండ్ ఆమెకు లైన్ వేస్తూ ఉంటే.. తాను మధ్యలో మీడియేటర్‌గా ఉండి ఫ్రెండుకు హెల్ప్ చేయడానికి వెళ్లి నిత్యాను పడేసి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు యాంకర్ రవి. 8 ఏళ్ల లవ్ తర్వాత తమ పెళ్లయిందని, ఇప్పటికి పెళ్లై కూడా ఏడేళ్లు అయిపోయిందని తెలిపాడు ఈ యాంకర్.
తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ