telugu navyamedia
సినిమా వార్తలు

అక్కినేని పేరును తిసేసిన సామ్‌..!

ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అందాల తార‌ సమంత స్టార్ హీరోల సరసన న‌టించి ప్ర‌స్తుత్తం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థానంలో ఉంది. తన నటనతో, అందంతో మాయ చేసి తన వైపు లాక్కుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలలో నటించి స్టార్‌డ‌మ్ సంపాదించుకుంది.

అక్కినేని నాగార్జున కొడుకు అయిన‌ అక్కినేని నాగచైతన్య ను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలలో కొనసాగుతూ మంచి సక్సెస్ ను అందుకుంది. పైగా బిజినెస్ రంగాలలో కూడా అడుగు పెట్టింది ఈ అమ్మ‌డు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత, పెళ్ళయాక సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో తన పేరుని సమంత అక్కినేనిగా మార్చుకుంది. నిత్యం తన ట్రెండీ ఫోటోలను, హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ, తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఖాతాలో సమంత అక్కినేని పేరుని తొలగించింది. ఇన్ని రోజుల వరకు తన పేరు ‘సమంత అక్కినేని’ అని ఉండేది. కానీ తాజాగా ఆ పేరుని తీసేసి ‘S’ అని ఒక లెటర్ ని మాత్రమే ఉంచింది. దీంతో ఉన్నట్టుండి సమంత ‘అక్కినేని’ అని ఎందుకు తీసేసింది, ఏమై ఉంటుంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య ఎమైనా గొడ‌వ‌లు జ‌రిగి ఉంటాయా? అనే సందేహం కూడా వినిపిస్తున్నాయి.

Related posts