telugu navyamedia
సినిమా వార్తలు

బీమ్లానాయ‌క్ సెకండ్ సింగిల్ రిలీజ్ ..

ప‌వ‌ర్‌స్టార్ పవన్​కల్యాణ్​, రానా నటిస్తున్న మల్టీస్టారర్​ చిత్రం ‘భీమ్లానాయక్​’. దసరా పండగను పురస్కరించుకుని ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, పోస్ట‌ర్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో పవన్​కు జోడీగా నిత్యామేనన్​ను న‌టిస్తుంది. వీరిద్దరికి సంబంధించిన ‘అంత ఇష్టం ఏందయ్యా నీకు.’ అనే టైటిల్ తో కూడిన పూర్తి మెలోడీగా సాంగ్ ను దసరా కానుకగా పవన్‌ ఫ్యాన్‌ కోసం విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్‌ చిత్ర ఆలపించారు. ఈ సాంగ్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న‌ది.

ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. డేనియల్​ శేఖర్​గా రానా ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి త్రివిక్రమ్​ స్క్రీన్​ప్లే అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తమన్​ స్వరాలు సమకూర్చనున్నారు.

Related posts