తెలియని సినీ ప్రేమికులు ఉండరు. హ్యపీ డేస్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. తనదైన నటనతో కుర్రకారు గుండెల్ని తన సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళంలోనూ మంచి ప్రాధాన్యం పొందిన నటిగా పేరు సంపాదించుకుంది. కానీ ఇటీవల మిల్కీ బ్యూటీ కరోనా బారిన పడటంతో షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. కరోనా నుంచి కోలుకున్న వెంటనే తమన్నా తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడింది. ఇందులో భాగంగా తమన్నా ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఒక్క రాత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు 11త్ అవర్ అనే పేరు పెట్టారు. ఈ వెబ్ సిరీస్‌ను తమన్నా పూర్తి చేసుకుంది. దీనికోసం తమన్నా దాదాపు వారం రోజులు కష్టపడి దీనిని పూర్తి చేసింది. ఇక ఇప్పటి నుంచి తన సినిమాలను పూర్తి చేసేందుకు తమన్నా ప్లాన్ చేస్తుంది. ఈ అమ్మడు సత్యదేవ్ హీరోగా చేస్తున్న ‘గుర్తుందా సీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రెస్ మీట్‌కు మిల్కీ బ్యూటీ హాజరయ్యింది. దీంతో పాటు నితిన్ ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న ‘అందాధున్’ రీమేక్‌లోను ముద్దుగుమ్మ కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడంతో తమన్న గోపీచంద్ సినిమా సీటీమార్‌లో తన పాత్రను త్వారగా పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించి అందరిని అలరించనుంది.