telugu navyamedia
సినిమా వార్తలు

సాయిధ‌ర‌మ్ తేజ్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్..

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉద‌యం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలియ‌జేశాయి. సెప్టెంబరు 10న తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన..అప్పటి నుంచి 35 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు తేజ్‌. ఇవాళ అపోలో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు.

కాగా తేజ్ డిశ్చార్జ్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మెగ‌స్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని ఇంటికి వ‌చ్చాడ‌ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన తేజ్‌కు ఇది పున‌ర్జ‌న్మ అని, అతను పూర్తిగా కోలుకోవటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ విజయ దశమి తమకు మరింత ప్రత్యేకమైనదిగా పేర్కొంటూ సాయితేజ్​తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్​ చేశారు. అనంతరరం తేజ్‌కు ఆయన బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

కాగా  సాయిధ‌ర‌మ్ తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  అతడి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు.. మెగా అభిమానులు సాయి ధరమ్ తేజ్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts