telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కపటధారి నుండి మరో ట్రైలర్…

అక్కినేని హీరో సుమంత్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమవుతున్నాడు. అయితే తాజాగా సుమంత్ ఓ థ్రిల్లర్ డ్రామాలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే పేరు ఫిక్స్ చేశాడు. ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ కనిపించాడు. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ ట్రైలర్ నేడు విడుదలైంది. ట్రైలర్‌ని బట్టి చూస్తే చాలా కాలం క్రితం మూతబడిన కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ కాగా క్రైమ్ కేసును చేధించాలనుకుంటాడు. అయితే ఈ సినిమా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కింది. దీనికి హేమంత రావు గారు కథను అందించారు. ఈ చిత్రాన్ని జీ ధనంజయన్ నిర్మించారు. ఈ సినిమా కన్నడ ‘కవలుదారి’ సినిమాకు రీమేక్‌గా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాతో సుమంత్ మళ్లీ హిట్ ట్రాక్‌లో వస్తాడని ఆశిస్తున్నారు. ఇందులో నాజర్, జయప్రకాష్‌ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ప్రేక్షకుల ఆదరణను ఎంతవరకు పొందుతుందో చూడాలి.

Related posts