telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆసక్తిని రేకెత్తిస్తున్న “అశ్వథ్థామ‌” టీజర్

Ashwathama

యంగ్ హీరో నాగశౌర్య ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వథ్థామ‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మెహ్రీన్ నటిస్తోంది. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 31న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నాగశౌర్య కథను అందిస్తున్నారు. ఉష మలుపూరి నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ను హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేసింది. ‘ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు.. వాడికి మాత్రం తెలిసిన ఒక రహస్యం’ అనే సంభాషణలతో షురూ అయ్యే టీజర్ చేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సస్పెన్స్ గా సాగుతూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ టీజర్ 4.1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.  మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts