విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’.. ‘The King Cobra has Arrived’ అంటూ ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసాడు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు. విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విక్రమ్ మరో లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫోటోలో పొడవాటి గజి బిజీ జుట్టుతో కనిపిస్తున్నాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదడులో ఉన్నట్లు చూపించారు. అయితే.. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్‌లో టీం ఇండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నెగిటివ్ రోల్‌లో కనిపించాడు. బౌలింగ్‌లోనే కాదు.. తన యాక్టింగ్‌లోనూ ఇర్ఫాన్ చాలా అద్భుతంగా నటించాడు. ఇక హీరో విక్రమ్ తనదైన స్టైలీస్ లుక్‌లోనే కనించాడు.
previous post