telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో విడుదల కానున్న టాలీవుడ్ సినిమాలు…!

Tollywood

కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఛిన్నాభిన్నం అయ్యింది. షూటింగులు లేక అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయిన ఎన్నో చిత్రాలు విడుదల ఆగిపోయాయి. దీనితో ఇదే సమయాన్ని ఓటిటి ఫ్లాట్ ఫామ్ వారు క్యాష్ చేసుకున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లోని చాలా చిత్రాలు నేరుగా ఓటిటిలో విడుదల అవుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మన టాలీవుడ్ లో కాస్త తక్కువ సంఖ్యలోనే చిత్రాలు ఓటిటిలో విడుదలయ్యాయి. అయితే ఇప్పటికీ పరిస్థితులు చక్కబడే మార్గం కనిపించకపోయే సరికి మన దగ్గర మేకర్స్ కూడా తమ చిత్రాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అలా ఇప్పుడు ఓ నాలుగు మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోనున్నాయని తెలుస్తుంది. నాని నటించిన “వి” చిత్రం, “అరణ్య”, “నిశ్శబ్దం” ఓటిటిలో విడుదల కానున్నాయి. ఇంకా “ఉప్పెన”, “సోలో బతుకే సో బెటర్”, “రెడ్” చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది.

Related posts