telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రయాన్-2 : సిగ్గులేని చర్య… ప్రముఖ మీడియా ప్రతినిధిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

Tollywood

చంద్ర‌యాన్ రాకెట్ ప్ర‌యోగంతో ప్ర‌పంచ‌దేశాల‌ను ఇండియా త‌న వైపు తిప్పుకునేలా చేసింది. అంతా సవ్యంగా జరిగిపోతోంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడం ఖాయం అనుకున్నారు. కానీ కేవలం చంద్రుడికి 2.1 కిమీ దూరంలో ఇస్రోకు, విక్రమ్ ల్యాండర్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇస్రో చైర్మన్ శివన్ ప్రధాని మోడీని కౌగిలించుకుని కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు దేశ ప్రజలందరినీ కలచి వేశాయి. ఇస్రో గొప్ప ప్రయత్నం చేసింది. విక్రమ్ ల్యాండర్ కమ్యూనికేషన్ కట్ అయినప్పటికీ ఇది విజయమే. శాస్త్రవేత్తల కృషి మరువలేనిది అంటూ ప్రజలు, సినీ రాజకీయ ప్రముఖులు ఇస్రోకు అండగా నిలుస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఏం జరిగిన పర్వాలేదు.. ఇస్రో భావితరాలకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తోంది. మీరు దీనినుంచి త్వరగా బయట పెడతారనే నమ్మకం ఉందని మంచు మనోజ్ తెలిపాడు. ఇక విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ కట్ ఐన అనంతరం కొందరు ఇస్రో సైంటిస్ట్స్ మీడియా ముందుకు వెళ్లారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి చేసిన అతి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలంతా చాలా ఒత్తిడిలో, బాధలో ఉన్న సమయంలో.. ఇస్రో చైర్మన్ మీడియా ముందుకు ఎందుకు రాలేదు.. మీడియాని పఫేస్ చేసే ధైర్యం ఎందుకు చేయలేదు అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన మంచు విష్ణు.. సిగ్గులేని చర్యగా అభివర్ణించాడు.

Related posts