telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒరిజినల్ ఫోటోలు పోస్ట్ చేసిన హీరోయిన్… దరిద్రం అంటూ నెటిజన్స్ ఫైర్

Zareen Khan says Allu Arjun is her favourite dancer

బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో తన ఫోటోలు పోస్టు చేసింది. అందులో జరీన్ వైట్ షర్ట్ తో బ్లాక్ ప్లాజో ధరించి… చొక్కాను కొంచెం పైకి కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఆ ఫొటోల్లో ఆమె పొట్టపై మడుతలు ఉన్నట్టుగా కన్పిస్తోంది. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. సిగ్గుగా అనిపించడం లేదా అలా ఫోజులివ్వడానికి, పరమ దరిద్రంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై జరీనా ఘాటుగా స్పందించారు. “నేను సహజంగా తీసుకున్న ఫోటోలనే పోస్టు చేశాను. ఫోటోషాప్‌లో మార్ఫింగ్ చేయడం, ఎలాంటి మరకలు కన్పించకుండా మేకప్ వేసుకోవడం నా కు ఇష్టముండదు. 50 కేజీల బరువు తగ్గినందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ ట్రోలింగ్ కే సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా జరీన్‌కు బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ తన మద్ధతు ప్రకటించింది. “జరీన్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు తెలివైన, బలమైన అమ్మాయివి” అని ప్రశంసిస్తూ జరీన్ కు పోస్ట్ చేసింది అనుష్క. ఇటీవలే కాజల్ కూడా మేకప్ లేకుండా తన ఫోటోలను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Related posts